గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:17 IST)

నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..

రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ప్రయోగించగా గాల్లోకి ఎగిరిన 6 సెకన్లలోనే రాకెట్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. 
 
ఈ పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించలేదు. రాకెట్‌ ఇలా గాల్లోనే పేలిపోవడానికి కారణాలపై నాసా నిపుణులు పరిశోధస్తున్నారు. ఇదిలావుండగా గాల్లో పేలిపోయిన రాకెట్‌ శకలాలు ఎవరికైనా కనపడితే వాటిని తాకడం ప్రమాదకరమని ఆర్బిటల్‌ సైన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాంక్‌ కల్బర్‌స్టన్‌ వర్జీనియా ప్రాంత ప్రజలను హెచ్చరించారు.