గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (01:23 IST)

ఇలాంటి విషయాల్లో అమెరికా, భారత్ ఒకటే మరి. కృతజ్ఞతలు ట్రంప్..!

మొన్నటిదాకా అమెరికా వీధుల నిండా జనం... ఇప్పుడు యూనివర్శిటీల నిండా జనం.. కారణం మాత్రం ఒకటే. అమెరికా ప్రశాంత వాతావరణాన్ని కంపు చేస్తున్న ట్రంప్. ట్రంప్‌నే కాదు.. ట్రంప్ మద్దతుదారులను కూడా మాట్లాడటానికి అనుమతించబోమన్నంత రేంజిలో జనం ఇప్పుడు అక్కడ ఉడికిపో

మొన్నటిదాకా అమెరికా వీధుల నిండా జనం... ఇప్పుడు యూనివర్శిటీల నిండా జనం.. కారణం మాత్రం ఒకటే. అమెరికా ప్రశాంత వాతావరణాన్ని కంపు చేస్తున్న ట్రంప్. ట్రంప్‌నే కాదు.. ట్రంప్ మద్దతుదారులను కూడా మాట్లాడటానికి అనుమతించబోమన్నంత రేంజిలో జనం ఇప్పుడు అక్కడ ఉడికిపోతున్నారు. ట్రంప్‌కు ఓటేసిన వారు సైతం ఎందుకు ఓటేశాము దేవుడా అంటూ వాపోతున్న పరిణామాలకు ఇప్పుడు అమెరికా వేదిక. అమెరికా వీధులు ప్రశాంతంగా ఊరేగింపులు తీసి ఊరుకుంటే అమెరికా యూనివర్శిటీలు ట్రంప్‌కు, అతడి మద్దతు దారులకు వ్యతిరేకంగా యుద్ధానికే తలపడుతున్నాయి. విద్యార్థులు తిరగబడితే అమెరికా అయినా భారత్ అయినా మరే దేశమైనా పరిణామాలు ఒకటే అని తొలిసారిగా ప్రపంచానికి చాటుతున్నందుకు, అలాంటి అవకాశం ఇచ్చినందుకు ట్రంప్‌కు నిజంగానే కృతజ్ఞతలు తెలపాలి. 
 
విషయానికి వస్తే.. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీలో ట్రంప్‌ మద్దతుదారుడు, వివాదాస్పద ఎడిటర్‌ మైలో ఇనాపొలస్‌ కార్యక్రమానికి నిరసనగా బుధవారం రాత్రి విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. క్యాంపస్‌ అద్దాల్ని పగులగొట్టి, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు.
 
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మైలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆందోళనలపై ట్విటర్‌లో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ వాక్‌ స్వాతంత్య్రాన్ని అనుమతించకుండా హింసాత్మకంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి నిధులు ఇవ్వబోమని హెచ్చరించారు. 
 
విద్యార్థులు అతిగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తరపున యూనివర్శిటీకి నిధులు ఇవ్వబోమని ట్రంప్ హెచ్చరించారట. ఇలాంటి మాటలు మనం కూడా ఇంతకుముందే ఎక్కడో విన్నట్లుంది  కదా.. అమెరికా భారత్‌ ఇక్కడైనా ఒకటిగా ఉన్నందుకు సంతోషమే కదా..