శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 28 మే 2016 (14:58 IST)

కన్ను కొడితే రమ్మని పిలిచింది... దగ్గరకొస్తే ఏం చేసిందో చూడండి( video)

వివాదాస్పద, ఆసక్తిని రేకెత్తించే ప్రకటనలు తయారుచేయడం ఇపుడు కొత్తేమీకాదు. కాకపోతే మరీ జాతుల మధ్య తేడాలను చూపిస్తూ ప్రకటనలు రూపొందిస్తే సమస్య జఠిలమవుతుంది. ప్రస్తుతం చైనాలో ఓ డిటర్జెట్ సంస్థ రూపొందించిన

వివాదాస్పద, ఆసక్తిని రేకెత్తించే ప్రకటనలు తయారుచేయడం ఇపుడు కొత్తేమీకాదు. కాకపోతే మరీ జాతుల మధ్య తేడాలను చూపిస్తూ ప్రకటనలు రూపొందిస్తే సమస్య జఠిలమవుతుంది. ప్రస్తుతం చైనాలో ఓ డిటర్జెట్ సంస్థ రూపొందించిన ప్రకటన ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
ఇంతకీ ఆ యాడ్ లో ఏముందయా అంటే... తెల్లగా ఉన్న ఓ చైనా యువతి దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మిషన్ వద్దకు వస్తుంది. అక్కడికి ఆమె రాగానే మరోవైపు నుంచి ఓ నల్లటి యువకుడు వచ్చి ఆమెకు కన్ను కొడతాడు. దాంతో ఆమె అతడిని దగ్గరకు రమ్మని పిలుస్తుంది. ముఖంపై ముఖం పెట్టేంత దగ్గరగా రానిస్తుంది. ఇక ఏదో ఇస్తుంది అనేలోపు అతడిని పక్కనే ఉన్న వాషింగ్ మెషిన్లో వేసి మూత వేసి దానిపైకి ఎక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మూత తీస్తుంది. 
 
నల్లటి యువకుడు కాస్తా తెల్లగా మారిపోయిన చైనా యువకుడిగా బయటకు వస్తాడు. ఇప్పుడిదే వివాదాస్పదమైంది. జాతి దురహంకారం అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చూడండి ఈ వీడియోను...