Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టూరిస్ట్ సెల్ ఫోన్‌ లాక్కుని సెల్ఫీ తీసుకున్న కోతి.. ఎక్కడో తెలుసా?

శనివారం, 1 జులై 2017 (11:48 IST)

Widgets Magazine

పర్యాటకుల పుణ్యమా అని జూలోని జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటుపడినట్లున్నాయి. తాజాగా టూరిస్ట్‌ చేతిలోని సెల్ ఫోన్‌ లాక్కుని కోతి సెల్ఫీ దిగిన ఘటన ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌ హామ్‌‌లోని జూలో చోటుచేసుకుంది. జూకు వెళ్లే పర్యాటకులు వన్యమృగాలతో సెల్ఫీలు తీసుకుంటుంటారు. కొందరైతే మరీ ఓవరాక్షన్ చేస్తూ.. క్రూరమృగాల చెంతనుండేలా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 
 
ఇలా జూకొచ్చిన పర్యాటకులు సెల్ఫీలు తీసుకోవడం చూసి చూసి ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ జూలోని కోతి.. ఏకంగా సెల్ ఫోన్ లాక్కుని సెల్ఫీ తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెబెక్కా అనే యువతి బర్మింగ్ హామ్‌లోని వైల్డ్ లైఫ్ పార్క్‌కి వెళ్లింది. అక్కడ జంతువులను తన సెల్ ఫోన్ బంధిస్తూ రెబెక్కా బిజీగా ఉంది. 
 
ఇంతలో కాపుచిన్‌ జాతికి చెందిన కోతి ఒకటి వేగంగా వచ్చింది. రెబెక్కా చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది. ఈ సమయంలో రెబెక్కా ఆ కోతిని క్లోజప్‌లో ఫొటో తీసేందుకు ప్రయత్నించగా కోతి ఆమె సెల్‌ఫోన్ లాక్కుని.. సరిగ్గా కెమెరా బటన్‌పై నొక్కింది.
 
దీంతో ఆ కోతి కూడా సెల్ఫీ తీసేందుకు నేర్చుకుందని తెలిసి అందరూ అవాక్కయ్యారు. దానిని చూసిన సిబ్బంది ఆ కోతి పేరు రొమాని అని చెప్పడంతో ఈ ఫొటోని సోషల్ మీడియాలో రెబెక్కా పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోకు లైకులు వెల్లువెత్తుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విమానంలో నిద్రిస్తున్న మహిళపై లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకాడు..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కదిలే బస్సుల్లో, రైళ్లల్లో మహిళలపై ...

news

సింహాల గుంపు మధ్యలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ ఎక్కడ?

సింహాల గుంపుకు మధ్యలో ఓ మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ...

news

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ...

news

భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదు: యోగి ఆదిత్యానాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదన్నారు. ...