బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (15:12 IST)

పుట్టిన రోజున జంతువులను భుజించిన జింబాబ్వే అధ్యక్షుడు!

రాబర్ట్ ముబాగే.. ఈ పేరు తెలియని నల్లజాతీయుడు ఉండరు. ఈయనే జింబాబ్వే దేశానికి అధిపతి. ఇటీవలే 91వ యేట నుంచి 92వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇందులో వివిధ రకాల జంతు మాంసంతో తయారు చేసిన వంటకాలను అతిథులకు వడ్డించి.. శభాష్ అనిపించుకున్నారు. ముగాబే పుట్టిరోజు రోజున వధించిన జంతువుల్లో ఏనుగులు, పశువులు, దున్నపోతులు, పులులు, సింహాలు, జింకలు ఇలా ఒకటేంటి.. అనేక వన్యప్రాణాలు ఉన్నాయి. 
 
ఈ పుట్టిన రోజు వేడుకల కోసం ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు సమాచారం. మొత్తం 20 వేల మంది అతిధులను ఆహ్వానించి ఈ వేడుకలను విక్టోరియా ఫాల్స్‌లోని లాడ్జ్, స్పా, గోల్ఫో కోర్సుల్లో అంగరంగ వైభంగా నిర్వహించారు. ఇది ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వన్య ప్రాణులను వధించి పార్టీ చేసుకోవడం తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ వేడుకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి 91 బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు.