శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (15:14 IST)

జపాన్‌లో 22 ఏళ్ల వ్యక్తిని చంపేసిన రోబో: ఆపరేటింగ్ తేడా వల్లే..?

టెక్నాలజీ ఎంత పెరిగినా అది మనిషి ఆయువుకే దెబ్బని పరిశోధకులు తెలిపిన సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఇతరత్రా ఉపకరణాలతో మనిషి ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించిన నేపథ్యంలో ఓ రోబో మనిషి ప్రాణం తీసింది. రోబోటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో విషాదం చోటుచేసుకుంది. మనిషికి సాయపడుతుందనుకుని మనిషి కనిపెట్టిన రోబోనే ఆ మనిషినే కాటేసింది.
 
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్లాంటులో రకరకాల కార్యకలాపాలను నిర్వహించడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ల వ్యక్తిని రోబో ఒక మెటల్ ప్లేట్‌కు క్రష్ చేసి చంపేసింది. 
 
అయితే, ఇందులో రోబో తప్పిదమేమీ లేదని... కేవలం మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆపరేటింగ్‌లో తేడా వల్లే ఈ ఘోరం సంభవించిందని తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది.