గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (15:53 IST)

ప్లీజ్ ఒబామా.. స్పాట్‌లు గుర్తించి చెప్పండి, మేం బాంబులేస్తాం : పుతిన్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రాధేయపడుతున్నారు. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉద్రవాద స్థావరాలపై రష్యా వైమానిక దాడులు చేస్తున్న విషయంతెల్సిందే. ఈ దాడుల కారణంగా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పుతిన్.. అగ్రరాజ్యాధిపతికి ఓ విజ్ఞప్తి చేశారు.
 
అమెరికా అంతరిక్షంలో ఉంచిన అత్యాధునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల అనుపానులను గుర్తించి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలను చెబితే, తాము నిమిషాల్లో అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించి వస్తామని చెప్పారు. ముఖ్యంగా సరైన ప్రాంతం గురించిన సమాచారం లేకుండా వెళితే, సామాన్యుల ప్రాణాలు కూడా పోతున్నాయని, అందువల్ల సరిగ్గా ఎక్కడ బాంబుల వర్షం కురిపించాలో తెలియజేయాలని పుతిన్ కోరారు. 
 
కాగా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను అమెరికా వ్యతిరేకిస్తుంటే, రష్యా మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, రష్యాలు భిన్న ధృవాలుగా వ్యవహరిస్తున్నాయి. కానీ, ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరు విషయంలో మాత్రం ఇరు దేశాలూ కలసి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.