శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (14:11 IST)

జెట్ క్రాష్: అది ప్రమాదం కాదు, నేరం: ఆసీస్ ప్రధాని ఫైర్

ఉక్రెయిన్‌లో మలేషియా విమానం కూల్చివేతపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబ్బోట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మలేషియా విమానం కూలిన సంఘటనపై రష్యా ప్రతిస్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం కూలగానే రష్యా దౌత్యవేత్త ఉక్రెయిన్‌ను నిందించారని, ఇది అత్యంత అసంతృప్తికరమైన స్పందన అని ఆయన అన్నారు. అది ప్రమాదం కాదని, నేరమని అబ్బోట్ వ్యాఖ్యానించారు. 
 
రష్యా తిరుగుబాటుదార్లు ఆ చర్యకు బాధ్యులుగా కనిపిస్తున్నారని ఆసీస్ ప్రధాని అన్నారు. ఉక్రెయిన్‌లో సమస్యలున్నాయని అందరికీ తెలుసునని, సమస్యలకు ఎవరిని తప్పు పట్టాలో కూడా మనకు తెలుసునని, ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్‌లో జరిగింది కాబట్టి తనకు సంబంధం లేనట్లుగా రష్యా మాట్లాడుతోందని, అది నిలబడే విషయం కాదని ఆయన అన్నారు. 
 
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిలబడాలనుకుంటే రష్యా దర్యాప్తునకు సహకరించాలని ఆయన అన్నారు. కాగా, ఉక్రెయిన్ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ శుక్రవారంనాడు అన్నారు.