శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 నవంబరు 2015 (12:37 IST)

ఫ్రాన్స్‌‌లో ఉగ్ర దాడుల్లో 'డీజిల్' కుక్క కన్నుమూత... 'దోబ్రయిన్యా' పప్పీతో రష్యా...

ఫ్రాన్స్ దేశంలోని రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదుల భీకరకాండ తెలిసిందే. ఈ దాడుల్లో అమాయకులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. వారిని రక్షించేందుకు ఫ్రాన్స్ దళాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులకు దిగాయి. ఆ సమయంలో ఫ్రాన్స్ భద్రతా దళాల వెంట డీజిల్ అనే పేరు గల కుక్క కూడా వెంట నడిచింది. 
 
ఐతే ఉగ్రవాదుల కాల్పుల్లో డీజిల్ ప్రాణాలు కోల్పోయింది. దాంతో రష్యా డీజిల్ కుక్క స్థానంలో ఓ ఆల్సేషియన్ పప్పీని పంపించేందుకు నిర్ణయం తీసుకున్నది. రెండు నెలల వయసున్న ఈ కుక్కపిల్లను పంపించేందుకు రష్యా అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి ఫ్రాన్స్ మంత్రికి లేఖ రాశారు. ఈ కుక్కపిల్లకు డోబ్రయిన్యా అనే పేరు పెట్టింది.