గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (14:56 IST)

అంతర్యుద్ధ గుప్పిట అరబ్బు దేశమైన యెమెన్! టెర్రరిస్టులో పెట్రేగిపోవడంతో..

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెట్రేగిపోవడంతో యెమెన్‌లో శాంతిభద్రతల పరిస్థితులు ఘోరంగా క్షీణించాయి. తద్వారా అరబ్బు దేశమైన యెమెన్ అంతర్యుద్ధ గుప్పిట చిక్కుకుంది. గత మూడు రోజులుగా షియా సారథ్యంలోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వెనక్కి వచ్చేయాల్సిందిగా భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క యెమెన్ అధ్యక్షుడు కూడా పారిపోవడంతో అంతా అయోమయ వాతావరణం నెలకొంది. 
 
ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో భారతీయులందరూ వెనక్కి వచ్చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి యెమెన్‌లో ఉన్న భారతీయులకు సమాచారాన్ని అందించామని, మార్గదర్శకాలను జారీచేశామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. మూడు రోజుల వ్యవధిలో మూడోసారి ఈ రకమైన హెచ్చరికలు యెమెన్‌లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం జారీచేసింది.
 
అక్కడున్న వారిలో ఎక్కువమంది నర్సులే కావడంతో వారిని తక్షణ ప్రాతిపదికన వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. వీరి సంఖ్య మూడున్నరవేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలావుండగా షియా తీవ్రవాదులు తమ పట్టును బిగించి, రాజధాని సనావైపు దూసుకురావడంతో యెమెన్ అధ్యక్షుడు రాజప్రాసాదాన్ని వదిలి పారిపోయారు. అలాగే దేశ రక్షణ మంత్రి కూడా అంతర్థానం కావడంతో అతన్ని పట్టించిన వారికి భారీగా నగదు బహుమతి ఇస్తామని రెబెల్స్ ప్రకటించారు.