సౌదీ మహారాజు కానున్న ఎంబీఎస్.. ట్రంప్ అభినందనలు

శనివారం, 18 నవంబరు 2017 (13:22 IST)

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టాభిషేకం చేసే సంప్రదాయం అమ‌లులో ఉంది. ఆ ట్రెండ్‌కు కింగ్‌ సల్మాన్ స్వ‌స్తి చెప్ప‌బోతున్నారు.

అయితే, కింగ్ స‌ల్మాన్ ''మసీదుల సంరక్షకుడు" అనే హోదాలో కొనసాగ‌బోతున్నార‌ని సమాచారం. సౌదీ యువరాజు ప‌ట్టాభిషేకంపై సౌదీ ప్ర‌భుత్వం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క ముందే ఎంబీఎస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలిపిన‌ట్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
ఇటీవల సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 11మంది యువరాజులతో పాటు మాజీ మంత్రులు, ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ కుటుంబంలో రాజ్య‌మేలుతున్న అవినీతిని అంత‌మొందించేందుకే ఎంబీఎస్ అరెస్టుల వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం కింగ్ సల్మాన్ తన కుమారుడు ఎంబీఎస్ సింహాసనాన్ని అప్పగించనున్నారని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా సౌదీ అరేబియా రాజ‌కుటుంబంలో అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రాచరిక వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోవడంతో అధికారాన్ని ఎంబీఎస్ చేజిక్కించుకున్నాడు. తానే ఛైర్మన్‌గా అవినీతి- నిరోధక గ్రూప్‌‌ను ఏర్పాటు చేసి అక్ర‌మార్కుల‌ భ‌ర‌తం ప‌ట్టాడు.దీనిపై మరింత చదవండి :  
Crown Salman Anti-corruption Saudi Arabia Prince Mohammed

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ...

news

చైనాలో ఆశ్చర్యం... ఫోటోలో మాట్లాడిన సత్యసాయి బాబా (వీడియో)

పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో చైనాలో మాట్లాడుతూ.. కనిపించింది. ఫాంగ్ సూన్ నగరంలోని ...

news

రాత్రిపూట బెంగళూరులో మహిళలు కనపించకూడదు: కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన ...

news

పోయెస్ గార్డెన్‌లో అర్థరాత్రి ఐటీ సోదాలు.. జయలలిత వ్యక్తిగత గదుల్లో...

శశికళ వర్గీయులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు చెందిన 188 ...