గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (11:31 IST)

స్మగ్లింగ్ చేశాడనీ...! నడి రోడ్డుపై నరికేశారు..!! ఎక్కడ..?

ముంబయి పేలుళ్ళ సంఘటనలో ఓ మనిషికి శిక్ష విధించడానికి భారత దేశంలో ఒకటి కాదు రెండు కాదు 22 యేళ్ల పట్టింది. కాని కొన్ని దేశాలలో అలా కాదు. అక్కడికక్కడే శిక్షలు వేసేస్తారు. నడిరోడ్డు మీదే నరికేస్తారు. స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని సౌదీ అరేబియాలో బహిరంగంగా నరికేశారు.
 
హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణ దండన అమలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన షా ఫైజల్ అజీజ్ షా అనే స్మగ్లర్.. తమ దేశ పౌరులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చుతున్నాడని అధికారులు ఆగ్రహించారు. 
 
అతనికి రెండు నెలల క్రితమే బహిరంగ మరణ దండన విధించారు. అయితే రంజాన్ మాసం కావడంతో ఆ శిక్షను 50 రోజుల పాటు నిలిపేశారు. అయితే రంజాన్ ముగియడంతో తిరగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు.