గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (16:56 IST)

రూ. 2 లక్షల కోట్ల ఆస్తులు దానం... సౌదీ అరేబియా యువరాజు ఔదార్యం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ (60) తనకున్న రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం దానం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల తలాల్ స్వయంగా ప్రకటించారు. ఈయన ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల పట్టికలో 34వ స్థానంలో ఉన్నారు. 
 
ఈయనకు సొంతంగా అనేక హోటళ్లు, కంపెనీలు ఉన్నాయి. తలాల్ తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని సమాజ సేవ కోసం వెచ్చిస్తున్నారు. ఈ విషయం గురించి బిన్ దలాల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ఆశపడుతున్నానన్నారు. అందుకు తన వంతు సాయం చేయడానికి సిద్ధమైనట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా సమాజ సంక్షేమం, మహిళల అభివృద్ధి, యువత సంక్షేమం, ప్రకృతి వైపరిత్యాల నివారణం వంటి మంచి విషయాల కోసం తన ఆస్తిని దానం చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. త్వరలోనే తనకు ఉన్న ఆస్తిలో 2 లక్షల కోట్ల ఆస్తులను దానం చేస్తానని తలాల్ వెల్లడించారు.