మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జూన్ 2016 (09:59 IST)

గల్ఫ్ దేశాల్లో ఇతరుల వైఫైని యూజ్ చేసుకుంటే అంతే సంగతులు!: ఫత్వా జారీ

స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో వైఫై వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అనుమతి లేకుండా ఇతరుల ఇంటర్నెట్‌ను వాడితే చోరిగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని గల్ఫ్ అధికారులు ఫత్వా జారీ చేశారు.
 
పార్కులు - ప్రైవేట్ షాపింగ్ మాల్స్ - హోటల్స్ - ప్రభుత్వ కార్యాలయాలలో పాస్ వర్డ్ లేకుండా ఉన్న వైఫై సౌకర్యాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునని అలాంటి సందర్భాలలో ఇది నేరం కింద పరిగణించమని స్పష్టం చేశారు. 
 
ఇతరుల ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడేయడాన్ని సహించేదిలేదని అధికారులు వెల్లడించారు. దాన్ని నేరం కిందే పరిగణిస్తామని అధికారులు వెల్లడించారు. వైఫై వాడకాన్ని చోరీగా పరిగణించాలని విడుదల చేసిన ఫత్వాలో అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియా రాజుకు సలహాలిచ్చే అధికారి అలీ అల్ హకామీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.