శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (06:49 IST)

అమెరికాలో ప్రవాస భారతీయుల ఆకలి కేకలు... ఎందుకు?

అమెరికాలో ప్రవాస భారతీయుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఒక్కపూట కడుపు నింపే అన్నదాత కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం హరికేన్ హార్వే తుఫాను. ఈ తుఫాను ధాటికి అమెరికా అతలాకుతలమైన విషయం తెల్సిందే

అమెరికాలో ప్రవాస భారతీయుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఒక్కపూట కడుపు నింపే అన్నదాత కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం హరికేన్ హార్వే తుఫాను. ఈ తుఫాను ధాటికి అమెరికా అతలాకుతలమైన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ హూస్టన్ నగరాన్ని హరికేన్ నామరూపాలు లేకుండా చేసింది. ఈ హరికేన్‌లో చిక్కుకుని తెలుగు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. 
 
వందలాది ఇళ్లు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువారే ఎక్కువ. తుఫాను కారణంగా హూస్టన్ అతలాకుతలమవడంతో ఏమీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆకలి బాధలు తప్పడం లేదు. 
 
నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. 
 
సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. వరదల కారణంగా అమెరికాలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాలన్ పెట్రోలు ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది.