గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2016 (12:06 IST)

ఆ సొరచేపలు 400 ఏళ్ల పాటు జీవిస్తాయట.. 156 ఏళ్ల వయసొస్తే కానీ శృంగారంలో పాల్గొనవట!

నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే గ్రీన్ ల్యాండ్ సొరచేపలు సుమారు 400 ఏళ్ల పాటు జీవిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దీంతో 150 ఏళ్లు జీవించే తాబేలు, 200 ఏళ్లు జీవించే తిమింగలాల కంటే సుదీర్ఘ కాలం జ

నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే గ్రీన్ ల్యాండ్ సొరచేపలు సుమారు 400 ఏళ్ల పాటు జీవిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దీంతో 150 ఏళ్లు జీవించే తాబేలు, 200 ఏళ్లు జీవించే తిమింగలాల కంటే సుదీర్ఘ కాలం జీవించే జలచరాలు ఇవేనని వారు పేర్కొన్నారు. ఈ చేపలు సముద్రంలో అత్యంత నెమ్మదిగా కదులుతాయని, గంటకు కేవలం ఒక మైలు దూరాన్ని మాత్రమే ప్రయాణించగలవని, ఏడాదికి కేవలం ఒక సెంటీ మీటర్ పరిమాణం మాత్రమే ఈ చేప పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు. 
 
అలా 20 అడుగుల వరకు ఈ చేప పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొపెన్ హాగన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ చేప పరిమాణాన్ని బట్టి దాని జీవిత కాలాన్ని అంచనా వేసినట్లు.. అది 400 ఏళ్లు బతుకుతుందని పరిశోధకులు గుర్తించారు. దీనిని నిర్ధారించుకునేందుకు 'బాంబ్ పల్స్' అనే పద్ధతిని కూడా ఈ చేపలపై ప్రయోగించినట్టు వెల్లడించారు. 
 
ఈ పరీక్షలో వారు గుర్తించిన చేపలు 1950 కాలంలో అవి యుక్త వయసులో ఉన్నట్టు గుర్తించారు. వీటికి 156 ఏళ్ల వయసు వస్తే కానీ శృంగారంలో పాల్గొనవని.. ఈ లెక్కన వారు పరిశోధించిన చేప 1624లో పుట్టిందని పేర్కొన్నారు.