బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:11 IST)

బ్రిటన్‌లోనే స్కాట్లాండ్.. సమైక్యవాదానికే ప్రజల పట్టం!

స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు ఆ దేశంలోని మెజార్టీ ప్రజలు వ్యతిరేకించారు. గ్రేట్ బ్రిటన్‌లోనే కలిసివుండేందుకు మొగ్గు చూపుతూ సమైక్యవాదానికే పట్టం కట్టారు. బ్రిటన్ నుంచి విడిపోయే అంశంపై స్కాట్లాండ్‌లో రెఫరెండం నిర్వహించారు. మొత్తం 32 జిల్లాలకు చెందిన 42 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
వీరిలో బ్రిటన్‌తో కలిసివుండేలా సమైక్యవాదానికి ఓటు వేసిన వారిలో 55 శాతం మంది ఉండగా, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు మొగ్గు చూపిన వారు 45 శాతం మంది ప్రజలు ఉన్నారు. ఈ ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో అత్యధికులు బ్రిటన్‌తో ఉండేందుకే మొగ్గు చూపడంతో 300 యేళ్ళ బ్రిటన్ - స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా కొనసాగనుంది. ఈ ఓటింగ్‌లో 26 జిల్లాలకు చెందిన స్కాట్లాండ్ వాసులు ఏకపక్షంగా తీర్పునివ్వగా, ఆరు జిల్లాల్లో మాత్రం విభజనకు అనుకూలంగా ఓట్లు వేయడం గమనార్హం.