శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (10:57 IST)

స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచిందోచ్!

స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది.
 
సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా ఇకపై కూడా కొనసాగనుంది.