బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:40 IST)

అతిథిగా వచ్చిన మహిళ పురుషుడిపై మగాడిలా రేప్ చేసింది!

అమెరికాలోని సియాటిల్‌లో ఓ మహిళ పిలవని అతిథిగా వచ్చి ఓ పురుషుడిపై అత్యాచారానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సియాటిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో 31 యేళ్ల వ్యక్తి ఒకరు తన ఇంటిలో నిద్రపోతుండగా చంటాయ్ గిల్మాన్ అనే 26 యేళ్ల మహిళ వచ్చి అతనిపై అత్యాచారానికి పాల్పడింది. 
 
ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వచ్చి, బాగా అలసటతో గాఢంగా నిద్రపోయానని, మెలకువ వచ్చి చూసుకుంటే, తనపై ఓ యువతి పడుకుని ఉందని చెప్పాడు. ఆమెను తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో నిందితురాలి డీఎన్ఏ ఆనవాళ్ళు కనిపించాయి. దీంతో ఆమెపై రెండో డిగ్రీ అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే అత్యాచారం చేసిన ఆరోపణలపై మాట్లాడటానికి ఆమె నిరాకరించింది.