శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (07:40 IST)

అమెరికాలో ఘోరం.. పురుషుడిపై మహిళ అత్యాచారం!

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం చోటు చేసుకుంది. రేప్ సీన్ రివర్స్ అయింది. గాఢ నిద్రలో ఉన్న పురుషుడిపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. కామంతో కళ్లుమూసుకుని పోయిన ఈ మహిళ అతని ఇంటికి అనుకోని అతిథిలా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే అమెరికాలోని సియాటిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఓ వ్యక్తి నిద్రపోతుండగా ఒక యువతి అత్యాచారానికి పాల్పడింది. ఇదే వ్యవహారంపై 31 ఏళ్ళ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వచ్చి, బాగా అలసటతో గాఢంగా నిద్రపోయానని, మెలకువ వచ్చి చూసుకుంటే, తనపై ఓ యువతి పడుకుని ఉందని చెప్పాడు. ఆమెను తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు చేయించారు. 
 
ఈ పరీక్షల్లో నిందితురాలి డీఎన్ఏ ఆనవాళ్ళు కనిపించాయి. కాగా, అతనిపై అఘాయిత్యానికి పాల్పడిన యువతి పేరు చాంటీ గిల్మాన్ (26)గా గుర్తించారు. ఈమె మత్తుపదార్ధాలు సేవిస్తూ ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.