శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:08 IST)

అలాంటి వారితో డేటింగ్ చేసేందుకు సై.. కానీ వారే ఇష్టపడం లేదు : సెలినా గొమేజ్‌

సెలబ్రిటీలు వారికి నచ్చినవారితో డేటింగ్‌ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే బాగా పాపులారిటీ, స్టేటస్ ఉన్న సెలబ్రిటీలు వారి రేంజ్‌కి తగ్గట్టుగానే పార్ట్‌నర్‌ని ఎంచుకుంటున్నారు. వారితోనే పార్టీలని పబ

సెలబ్రిటీలు వారికి నచ్చినవారితో డేటింగ్‌ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే బాగా పాపులారిటీ, స్టేటస్ ఉన్న సెలబ్రిటీలు వారి రేంజ్‌కి తగ్గట్టుగానే పార్ట్‌నర్‌ని ఎంచుకుంటున్నారు. వారితోనే పార్టీలని పబ్బులని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. కానీ పాప్‌ సింగర్‌ సెలినా గొమేజ్‌ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే తనకన్నా తక్కువ పాపులారిటీ ఉన్న వారితోనే డేటింగ్‌ చేయాలనుకుంటుందట. ఈ భామకి పాప్ సింగర్‌గా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. ఈమె పాటలంటే కుర్రకారు పడిచస్తారు. 
 
ఇదిలావుంటే... ఈ భామ పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌తో ప్రేమాయణం సాగించింది. ప్రేమాయణం ఎంత జోరుగా సాగిందో అంతకంటే జోరుగా బెడిసికొట్టింది. ఇటీవల వీరిద్దరు విడిపోవడంతో మరొకరితో డేటింగ్‌ చేసే ప్రయత్నంలో ఉందట ఈ భామ. అయితే ఈసారి మాత్రం తక్కువ పాపులారిటీ ఉన్నవారితోనే డేటింగ్‌ చేయాలని భావిస్తోందట. కానీ అందాల్ని వలవేసి వెతికినా కూడా అలాంటి వాళ్లు దొరకట్లేదని వాపోయింది. 
 
''నాకంటే తక్కువ పాపులారిటీ ఉన్నవారితోనే డేటింగ్‌ చేద్దామనుకుంటున్నా. కానీ ఎవరూ దొరకట్లేదు. నాతో డేటింగ్‌ చేస్తే ఇబ్బంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరూ తమ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌లో ఉంచడానికి ఇష్టపడరు. నాతో డేటింగ్‌ చేస్తే పాపులారిటీ లేనివాళ్లు పబ్లిక్‌లో పడతారని భావిస్తున్నట్టున్నారు. అందుకే తక్కువ పాపులారిటీ ఉన్నవారు నన్ను చూసి భయపడుతున్నారు'' అని తన మనసులోని మాటను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.