గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (20:21 IST)

సెక్సును డబ్బుతో కొనే మగాళ్లు అవి కూడా చేసేస్తారు... రిపోర్ట్

సెక్స్ అంటే పిచ్చిగా ప్రవర్తిస్తూ డబ్బుతో ఆ ఆనందాన్ని కొనుగోలు చేసి అనుభవించే మగాళ్లలో క్రూరమైన చర్యలు కూడా ఉంటాయని తాజాగా తేలింది. ఇంతకీ వారు పాల్పడే ఆ క్రూరమైన చర్యలు ఏంటంటే, అత్యాచారంతో పాటు ఇంకా ఇతర లైంగిక దాడులకు పాల్పడుతారని అధ్యయనంలో తేలిందని యూనివర్శిటీ ఆఫ్ కేలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ ఒకరు వెల్లడించారు. 
 
సెక్సును డబ్బుతో కొనుగోలు చేసి అనుభవించే మగవారు స్త్రీ అనుమతితో సెక్స్ చేయడంతో పాటు బలవంతంగా స్త్రీపై అత్యాచారం చేయడానికి కూడా వెనుకాడరని తమ అధ్యయనంలో తేలిందని చెపుతున్నారు. కాగా ఎవరైతే సెక్సు ఆనందాన్ని డబ్బుతో కొనుగోలు చేయకుండా భాగస్వామితోనే ఆ ఆనందాన్ని పొందుతారో వారిలో ఈ లక్షణాలు లేనట్లు తేలింది. తమ అధ్యయనంలో భాగంగా 100 మందికి పైగా పురుషులపై పరిశోధన చేయగా ఫలితాలు ఇలా వచ్చినట్లు తెలిపారు.