మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (11:33 IST)

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా షాహిద్ అబ్బాసీ

పనామా గేట్ స్కామ్‌లో చిక్కుకుని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్థానంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)నేత షా

పనామా గేట్ స్కామ్‌లో చిక్కుకుని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్థానంలో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)నేత షాహిద్ ఖాకన్ అబ్బాసీ ఎన్నికయ్యారు. ఈయన గత నవాజ్ షరీఫ్ మంత్రివర్గంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. 
 
కాగా, ఈ ప్రధాని పదవి కోసం మొత్తం ఆరుగురు పోటీ పడ్డారు. వీరిలో అబ్బాసీతో పాటు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి షేక్ రషీద్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున ఇద్దరు నేతలు ఖుర్షీద్‌షా, నవీద్ కమర్, ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్ తరపున కిశ్వర్ జెహ్రా, జమాతే ఇస్లామీ తరఫున తారిఖుల్లాలు ఉన్నారు. 
 
అయితే, ఆ దేశ జాతీయ అసెంబ్లీ మాత్రం అబ్బాసీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీంతో 45 రోజుల పాటు పాక్ తాత్కాలిక ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఉంటారు. ప‌నామా ప‌త్రాల అవినీతి కేసు వ‌ల్ల పాక్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు అన‌ర్హత వేటు వేస్తూ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించిన విషయం తెలిసిందే.