Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్మశానంలో ప్రియుడి శవానికి ముద్దులు పెట్టిన ప్రియురాలు... అదే తొలిసారి...

గురువారం, 13 జులై 2017 (16:25 IST)

Widgets Magazine
love

పింటరెస్ట్ ద్వారా వారిద్దరికీ పరిచయమైంది. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరస్పరం ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఇక లాభం లేదు... నిన్ను చూడనిదే వుండలేనన్నాడు ప్రియుడు. సరే వచ్చేయ్.. నేను ఎదురుచూస్తుంటాను అంది ప్రియురాలు. ఆ మాటనేసరికి అతడికి ఆగలేకపోయాడు. ఆమెను చూసేందుకు కట్టలు తెంచుకునే ఉత్సాహంతో బయలుదేరుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతడు మరణించాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలో వుంటున్న 58 ఏళ్ల జాక్ మార్టిన్ లండన్‌లో వుంటున్న 43 ఏళ్ల హెలెన్ హంటర్ ప్రేమలో పడ్డారు. ఇరువురికీ పింటరెస్ట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జాక్ తన ప్రియురాలు హెలెన్ ను చూసేందుకు బయలుదేరే క్రమంలో గుండెపోటుతో మరణించాడు. తన ప్రియుడి మరణవార్త విన్న హెలెన్ వెంటనే లండన్ నుంచి అమెరికాలో అతడి నివాస ప్రాంతమైన అర్కాన్సాస్‌కు వచ్చింది.
 
నిర్జీవంగా పడి వున్న ప్రియుడి దేహం వద్దకు వెళ్లి ముద్దులు పెట్టింది. కాసేపు తలను నిమిరింది. అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అలా కాసేపు చూస్తుండిపోయింది. తన అనుభవాలను పంచుకుంటూ... జాక్ చనిపోలేదు. నవ్వుతూ నన్నే చూస్తున్నట్లున్నాడు అంటూ చెప్పుకుంది. తను లేకపోయినా అతడి జ్ఞాపకాలతో ఇలా బతికేస్తానని చెప్పింది హెలెన్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశంలోకి జికా మహమ్మారి.. దోమల నిర్మూలనకు గూగుల్, మైక్రోసాఫ్ట్ హైటెక్ టూల్స్

బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చిన జికా వైరస్ దేశంలోకి వచ్చేసింది. దేశంలో తొలిసారి గుజరాత్‌లో ...

news

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా ...

news

డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ ...

news

రోజా పెద్ద తాగుబోతు.. పీకే ఏం పీకుతాడో చూడాలి... ఎవరు?

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార, ...

Widgets Magazine