శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:07 IST)

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదా? ట్రంప్ వద్దు, ఒబామా కావాలంటున్న అమెరికన్స్

అమెరికాలో రోజురోజుకీ నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతోంది. మొన్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు తెలిపినవారు సైతం నెల తిరక్కుండానే తమకు ట్రంప్ పాలన చెత్తగా వుందంటూ

అమెరికాలో రోజురోజుకీ నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతోంది. మొన్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు తెలిపినవారు సైతం నెల తిరక్కుండానే తమకు ట్రంప్ పాలన చెత్తగా వుందంటూ బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఒబామా హయాంలో అమెరికా పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లలేదనీ, ట్రంప్ వచ్చాక గందరగోళంగా పరిస్థితులు రోజుకో రకంగా మారిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా అమెరికాలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ పోలింగ్ అధ్యయనంలో ట్రంప్ పట్ల అమెరికన్లలో వున్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడింది. డొనాల్డ్ ట్రంప్ ను ఉన్నఫళంగా అధ్యక్ష పీఠం నుంచి తొలగించి ఒబామాను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని కోరుకుంటున్నవారు అధికంగా వుండటం గమనార్హం. 52 శాతం మంది తమకు ఒబామా అధ్యక్షుడిగా కావాలంటూ కోరుతున్నారు. 
 
కాగా ట్రంప్ పాలనతో సంతోషంగా వున్నట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. దీన్నిబట్టి ట్రంప్ నిర్ణయాల కారణంగా అమెరికాలో క్రమంగా నిరాశ నిస్పృహలు పెరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో అంతర్యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చరిత్రలో ఒక దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వ్యతిరేకత పెల్లుబుకడం ఇదే తొలిసారి.