గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (12:41 IST)

అందమే పెట్టుబడి.. రూపాయి ఖర్చులేకుండా.. విదేశీ ట్రిప్పులు.. 80 మందితో డేటింగ్!

ఈ రోజుల్లో ప్రయాణం అంటే మాటాలా... కట్టలు కట్టలు డబ్బులు కావాల్సిందే. ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే జేబులో వంద రూపాయల కాగితం కనీసంగా ఉండాలి.

ఈ రోజుల్లో ప్రయాణం అంటే మాటాలా... కట్టలు కట్టలు డబ్బులు కావాల్సిందే. ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే జేబులో వంద రూపాయల కాగితం కనీసంగా ఉండాలి. అదే విమానాల్లో, షిప్పుల్లో ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయ్యాల్సిందే. కానీ, అందాన్నే పెట్టుబడిగా పెట్టుకున్న 30 ఏళ్ల బ్రిటన్ భామ నటాలీ వుడ్‌ రూపాయి కూడా ఖర్చు చేయకుండా దేశ దేశాలు తిరుగుతోంది. 
 
దేశాలన్నీ తిరిగి రావాలన్న కోరికతో పాటు ఓ మంచి భర్తను వెతుక్కోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నటాలీ.. పోయిన ప్రతి చోటా 'మిస్ ట్రావెల్' డేటింగ్ వెబ్ సైట్‌లో ఓ ధనవంతుడిని తోడుగా చేసుకుంటుందట. రెండు ఏళ్ల కాలంలో ఆమె ఇప్పటివరకు 80 మందితో డేటింగ్‌ చేసిందట. ధనవంతులు తన అందానికి ఇట్టే పడిపోతున్నారని, ఇక వారితో స్వల్పకాల లైంగిక బంధం తనకు ఇబ్బందేమీ లేదనీ చెబుతోంది. ఇప్పటివరకూ దాదాపు కోటి రూపాయల (1,20,000 డాలర్లు)కు పైగా తన కోసం డేటింగ్ ఫ్రెండ్స్ ఖర్చు చేసి ఉండవచ్చని నటాలీ గర్వంగా చెబుతోంది.
 
అయితే ఇదంతా ఫ్రీగా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే... ఈ ఖర్చులకు బదులుగా ఆమె వాళ్లకి పడక సుఖాన్ని అందిస్తుంది. టర్కీ, అబుదాబి, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో విహరించిన నటాలీ ప్రస్తుతం అమెరికాలోని మియామిలో తన కొత్త డేటింగ్ పార్టనర్‌తో కలిసి సరదాగా గడుపుతోంది. తనకు సెక్స్ ముఖ్యం కాదని.. కంపెనీ ముఖ్యమని ఆమె అంటోంది. 
 
సంపన్న వర్గానికి చెందిన మగాళ్లు.. తన అందానికి ఇట్టే దాసోహమవుతారని.. వాళ్లతో సహజంగానే సెక్స్ చేస్తున్నానని నటాలీ అంటోంది. తన ఈ ప్రయాణం ఎంత దూరం.. ఎన్ని దేశాల్లో సాగుతుంతో.. తనకు నచ్చినవాడు ఎప్పటికి దొరుకుతాడో.. తన యాత్రకు ఎప్పుడు ముగింపు వస్తుందో చెప్పలేననీ ఈ ముద్దుగుమ్మ అంటోంది.