శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (11:52 IST)

జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్ టెర్రరిస్టులు భారత సైన్యానికి పెనుసవాల్‌గా మారింది. జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టింది. రాష్ట్రంలోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాల్పుల అనంతరం అక్కడ సోదాలు నిర్వహించిన భారత సైన్యానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందు సామగ్రి దొరికింది. పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభించిన నేపథ్యంలో మరింత మంది ఉగ్రవాదులు చొచ్చుకొచ్చి ఉంటారన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో నిఘాను పెంచింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెర్రరిస్టులు జవాన్లపై కాల్పులు జరపడంతో.. సైన్యం కూడా ప్రతి కాల్పులు జరపాల్సి వచ్చింది.