శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (10:52 IST)

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు ఉండటమే. ఈ నౌక ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఈ నౌక మునిగిపోయిన స్థలాన్ని గుర్తించిన పరిశోధకులు... మూడేళ్ళ పాటు శ్రమించి ఇపుడు వెలికి తీశారు. 
 
ఈ నౌకను వెలికితీసేందుకు తీగలు, లోహపు దూలాలను ఏర్పాటు చేస్తూ కొన్ని నెలలుగా శ్రమించి, గురువారం ఉదయానికి దాన్ని నీటి ఉపరితలానికి తీసుకువచ్చారు. ఓడరేవుకు చేర్చేందుకు రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆచూకీ దొరకకుండా పోయిన తొమ్మిది మృత దేహాల కోసం అన్వేషిస్తామని అధికారులు పేర్కొన్నారు.