గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (16:24 IST)

బ్రిటన్‌ పురుషుల్లో వీర్య కణాల లోపం.. వీర్యాన్ని దానం చేస్తున్న భారతీయులు

బ్రిటన్‌‌లో స్త్రీపురుషులు సంతాన లోపంతో బాధపడుతున్నారు. దీంతో భారతీయ యువకులు వీర్యాన్ని దానం చేసేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. పెరిగిన సాంకేతికత సాయంతో దాతల వివరాలు తెలియకుండా.. వారిని కలవకుండా.. చూడకుండానే.. వారి వీర్యాన్ని తీసుకొని సంతానం పొందుతున్నారు. 
 
బ్రిటన్‌లో ఇలాంటి దాతల సంఖ్య ఈ మధ్య నానాటికీ పెరుగుతోంది. సంతానలేమితో ఇబ్బంది పడుతున్న బ్రిటన్ దేశస్తులకు సంతానప్రాప్తిని కల్పిస్తూ.. వీర్యాన్ని దానం చేస్తున్న వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉందని తాజాగా వెల్లడైన ఒక పరిశోధన చెబుతోంది. 2009 నుంచి 2013 మధ్య కాలంలో తమ వీర్యాన్ని దానంగా ఇస్తామంటూ ఆసక్తి చూపిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 
 
52 మంది భారతీయ యువకులు.. తమ వీర్యాన్ని దానం ఇచ్చేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఐరీశ్ యువకులు ఉన్నారు. వీరిలో మొత్తం 34 మంది తమ పేర్లను నమోదు చేసుకున్న వారున్నారు. అలాగే, పాకిస్థాన్, చైనా, ఆఫ్రికన్ యువకులు కూడా వీర్యాన్ని ఆసక్తి చూపుతున్నారు. 
 
కేవలం యువకులు మాత్రమే కాదు. మహిళలు కూడా తమ అండాలను దానం ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పురుషుల మాదిరే.. మహిళల్లో కూడా భారతీయ మహిళలే ఫలదీకరణ కోసం తమ అండాల్ని దానం ఇచ్చేందుకు ముందుకురావటం విశేషంగా చెబుతున్నారు. తమ అండాల్ని ఇచ్చేందుకు దాదాపు 57 మంది భారతీయ మహిళలు తమ అంగీకారాన్ని తెలిపినట్లుగా చెబుతున్నారు.