Widgets Magazine

మద్యం షాపుల్లో ఆడవాళ్లు... ఏమీ చేయలేక చట్టం మార్చేసిన దేశం...

శుక్రవారం, 12 జనవరి 2018 (15:27 IST)

Widgets Magazine
hot drink

మద్యం అంటే మహిళలు కస్సుమంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మద్యపానం కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలాచోట్ల మద్యపాన నిషేధం వున్నది. ఐతే చాలా దేశాల్లో మద్యం అమ్మనిదే ఆర్థిక పరిస్థితి గాడినపడే పరిస్థితి వుండదు. అందువల్ల మద్యం అమ్మకాలకు గేట్లు బార్లా తెరిచేస్తుంటారు. 
 
ఐతే తాజాగా శ్రీలంకలో మద్యం అమ్మడానికి, కొనేందుకు మహిళలకు అనుమతినిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు.. అంటే గత 38 ఏళ్లుగా శ్రీలంకలో మహిళలు మద్యం అమ్మటం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు కానీ వీల్లేదు. కానీ శ్రీలంక తెచ్చిన కొత్త చట్టంతో మహిళలు ఎంచక్కా మద్యం షాపుల్లో మద్యం విక్రయాలు చేయవచ్చు. అలాగే కొనుగోలు చేయవచ్చు. 
 
ఐతే హఠాత్తుగా శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వేరే కారణం ఉందంటున్నారు. అదేంటయా అంటే... ఇప్పటికే శ్రీలంక దేశంలో చాలా మద్యం షాపుల్లో మహిళలు మద్యం విక్రయాలు చేసే ఉద్యోగాల్లో చేరిపోవడమేనట. చట్టం వున్నప్పటికీ వారు లెక్కచేయకుండా మద్యం దుకాణాల్లో పనిచేస్తుండేసరికి... ప్రభుత్వమే దిగివచ్చి మహిళలపై వున్న చట్టాన్ని ఎత్తివేసినట్లు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సుప్రీం జడ్జీల తిరుగుబాటు.. ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయవాదులు తిరుగుబాటు చేయడంతో ప్రధానమంత్రి ...

news

సుప్రీం కోర్టు జడ్జీల తిరుగుబాటు.. దేశ చరిత్రలో ప్రప్రథమం

భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశంలో జరగని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ...

news

భారతీయ రైలులో విమాన సౌకర్యాలు...

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో ...

news

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. సమస్యల ఏకరవు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ...