శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:55 IST)

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో తమిళనాడుకు చెందిన 16 మంది మత్స్యకారులు ఉన్నారు. మంగళవారం లంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపలు పడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు చెప్పారు. వారితో పాటు 3 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టైన మత్స్యకారులు పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
 
అయితే సెల్వరాజ్ అనే ఓ మత్స్యకారుడు చనిపోయాడని, అతని మృతదేహం బోటులో ఉండగా గుర్తించినట్టు తెలిపారు. జాఫ్నా జిల్లాలోని కంగెన్‌సన్దురైలో మూడు బోట్లు అర్థరాత్రి చేపల వేటలో ఉండగా బోట్లను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఫిషెరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రవిచంద్రన్ చెప్పారు.