Widgets Magazine Widgets Magazine

ముస్లిం శరణార్థులకు ఉద్యోగాలు, బీమా మేమిస్తాం: అమెరికా సీఈఓల తిరుగుబాటు

హైదరాబాద్, మంగళవారం, 31 జనవరి 2017 (02:01 IST)

Widgets Magazine

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సాఫ్ట్ వేర్, తదితర దిగ్గజ కంపెనీలు తిరుగుబాటు ప్రకటించాయి. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి శరణార్థుల రాకను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీచేసిన ఉత్తర్వులను ఆ దేశ కార్పొరేట్‌ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయం నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో 75 దేశాల్లో 10వేలమంది శరణార్థులను తమ ఉద్యోగులుగా నియమించుకోవాలను కుంటున్నామని స్టార్‌బక్స్‌ కంపెనీ సీఈవో హోవర్డ్‌ షుల్ట్జ్‌ ప్రకటించారు.

అమెరికాకు రాకుండా శరణార్థులపై ట్రంప్‌ నాలుగు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అలాగే సిరియాతోసహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి పర్యాటకుల రాకను ఆయన పూర్తిగా నిషేధించారు. ఉగ్రవాద దాడుల నుంచి అమెరికాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్‌ నిర్ణయంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
 
ట్రంప్‌ నిర్ణయం వల్ల ప్రభావం పడే కార్మికులకు అండగా ఉండేందుకు పూర్తిగా కృషి చేస్తామని షుల్ట్జ్‌ ఆదివారం తన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వివిధ దేశాల్లో అమెరికా ఆర్మీ అభ్యర్థన మేరకు భద్రతా దళాలకు దుబాసీలుగా, సహాయక సిబ్బందిగా సేవలు అందించిన వ్యక్తులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు.

ఒబామా హెల్త్‌ కేర్‌ ప్రజాబీమా పథకాన్ని ట్రంప్‌ ఎత్తివేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు తామే ఆరోగ్యబీమా అందిస్తామని షూల్ట్జ్‌ స్పష్టం చేశారు. షూల్ట్జ్‌ గతంలోనూ పలు అంశాలపై గట్టిగా గళమెత్తి పతాక శీర్షికలకు ఎక్కారు. దుకాణాలకు తుపాకులు తీసుకొని రావొద్దని, జాతుల మధ్య సంఘర్షణ గురించి చర్చించాలని ఆయన గతంలో పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శరణార్థులపై ఆంక్షలు కాదు ఉగ్రవాదులకోసం కారుస్తున్న కన్నీళ్లే అసలు సమస్య: గయ్ మన్న ట్రంప్

వివాదాస్పదమైన వలస నిరోధక ఆదేశంపై యావత్ ప్రపంచం మండిపడుతుండగా లైట్ తీసుకోండంటూ అమెరికా ...

news

ముస్లింలను ఒక్కతాటికి వచ్చేలా చేసిన ట్రంప్ మహాశయా నీకు జోహార్లంటున్న జిహాదీలు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏడు ముస్లిందేశాల ప్రజలకు బద్దశత్రువుగా ...

news

వాళ్లు రాజీనామా చేస్తారా? అంతకుముందే ప్యాకేజీకి చట్టభద్రత తెచ్చేద్దాం: బాబు నిర్దేశం

పార్లమెంటులో కూడా వైకాపా ఎంపీల పప్పులేమాత్రం ఉడకనివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ...

news

మాల్యా రుణాలు పొందేందుకు సాయపడిన మన్మోహన్.. బీజేపీ ఆరోపణ

బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్‌ అధిపతి విజయ్‌ ...