శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , గురువారం, 22 జూన్ 2017 (05:19 IST)

భూమిని వదిలిపెట్టకపోతే మనిషికి మనుగడే లేదు.. స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక

మరో చంద్రమండలయాత్రకు మానవులు బకాయి పడి ఉన్నారని విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీపెన్ హ్యాకింగ్ పేర్కొన్నారు. వచ్చే 500 సంవత్సరాల్లో భూమిపై జరిగే అంతరిక్ష తరంగాల దాడిని మానవులు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. భూమ్మీద మనిషి నివసించే స్థలం తరగిపో

మరో చంద్రమండలయాత్రకు మానవులు బకాయి పడి ఉన్నారని విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీపెన్ హ్యాకింగ్ పేర్కొన్నారు. వచ్చే 500 సంవత్సరాల్లో భూమిపై జరిగే అంతరిక్ష తరంగాల దాడిని మానవులు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. భూమ్మీద మనిషి నివసించే స్థలం తరగిపోతోంది. ఇతర ప్రపంచాలలోకి మనం వెళ్లక తప్పదు. సౌర వ్యవస్థలను ఈ లక్ష్యంతోటే మనం అన్వేషించాల్సి ఉంది. ఇదొక్కటే మనల్ని మనం కాపాడుకునే మార్గం.  బతికి బట్టకట్టాలంటే మనుషులు భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే అంటూ స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. 
 
భూమిని వదిలిపెటడం ఏమంత కష్టమైన పని కాదు. దేశాలు పరస్పరం సహకరించుకుంటే మానవులు చంద్రుడిపై 30 ఏళ్లలో కాలనీలు నిర్మించుకోగలరు. మరో 15 సంవత్సరాలలోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టగలరు. అక్కడినుంచి కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఇతర ప్రపంచాలకు ప్రయాణించగలరు అని స్టీఫెన్ హ్యాకింగ్ భవిష్యద్దర్శనం చేయించారు.
 
చంద్రమండలంపై ఒక మానవ గ్రామాన్ని నిర్మించడానికి 20 ఏళ్ల సమయం పడుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2016లో ఒక ప్రకటన చేసింది. ఇక 2030 నాటికి అంగారక గ్రహంపైకి నేరుగా మనిషిని పంపించడానికి నాసా దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. 
 
1972లో మనిషి చివరిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టాడు. చంద్రుడిని చివరిసారి దర్శించిన అంతరిక్ష యాత్రికుడు యూజిన్ జెమెన్ ఈ జనవరిలో మరణించారు. చివరివరకు ఆయన అంతరిక్ష యాత్రలకు జీవితకాల సలహాదారుగా ఉన్నారు. 
 
ఈ నేపధ్యంలోనే స్టీఫెన్ హ్యాకింగ్ అటు భూమండలం అంతర్ధానాన్ని, ఇటు శాస్త్రీయ ఆశావాదాన్ని కలిపి మానవులు భూమిని పదిలిపెట్టాల్సిందేనని చెప్పారు. నక్షత్రాల్లో నివాసం ఏర్పర్చుకోవాలంటే మనకు మరో వెయ్యి సంవత్సరాల సమయం మాత్రమే ఉందని పేర్కొన్నారు. వచ్చే వందేళ్లలోనే భూమిపై అనేక ప్రాంతాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని, ఈ పరిస్థితిని ఊహిస్తూ భూమి మనిషి మనుగడకు కేంద్రంగా ఉంటుందనే ఆశాభావంతో తాను గడపలేనని హ్యాకింగ్ చెప్పారు. 
 
భౌతిక శాస్త్ర సూత్రాలు, సంభావ్యతా సూత్రాలు భూమిపై గ్రహశకలాల దాడి తప్పదని చాటి చెబుతున్నాయని, ఇంకా ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోవడం, జంతు వినాశనం, భౌతిక వనరులు క్షీణించిపోవడం వంటివి భూమిపై మానవ మనుగడకు చెడు సంకేతాలను ఇస్తున్నాయని హాకింగ్ చెప్పారు.
 
కాబట్టే భూమి చిన్నదైపోతోంది. భూతాపం పెనుప్రమాదంగా మారనుంది. వాతావరణ మార్పుపై చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. నేను మానవ భవిష్యత్తు గురించి, దాన్ని సాధించడానికి దీర్ఘకాలిక వ్యూహం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటినుంచే ఇతర ప్రపంచాలకు వెళ్లడంపై మనం దృష్టి  సారిద్దాం. భూమికి అతి సమీపంలో ఉన్న ప్రాక్సిమా సెంటారి నక్షత్రం మనకు 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇదే మనకు ఆశలు కలిగించే లక్ష్యం. కానీ ఇప్పుడున్న సాంకేతిక శక్తితో నక్షత్ర యాత్ర పూర్తిగా అసాధ్యం అని హాకింగ్ చెప్పారు.

కాని స్టార్‌షాట్ అనే సైద్ధాంతిక సాంకేతిక జ్ఞానం సాయంతో అతి చిన్న పరిశోధనా ఉపగ్రహాలను ప్రాక్సిమా సెంటారీ బి నక్షత్రానికి 2.5 కోట్ల మైళ్ల సమీపంలోకి పంపించి అక్కడి సమాచారాన్ని భూమ్మీదికి తెప్పించుకునే అవకాశం ఉందని స్టీపెన్ హాకింగ్ చెప్పారు. 
 
భవిష్యత్తులో అత్యంత కాంతి వనరులను అంతరిక్షంలోకి విస్పోటనం చేయించడం ద్వారా వాటిలోంచి చిన్న ప్రోబ్‌లను గంటలోపే అంగారకగ్రహం మీదికి పంపించవచ్చునని, ప్లూటో ఉపగ్రహాన్ని రోజుల్లో చేరవచ్చని, ఇక అల్ఫా సెంటారి నక్షత్రాన్ని 20 సంవత్సరాల్లో చేరవచ్చని హాకింగ్ చెప్పారు. అయితే ఈ విధానంలో మనుషులను పంపలేమన్నారు.

జీవజాతుల నుంచి మనిషి విడిగా జీవించడం 20 లక్షల సంవత్సరాల క్రితం మొదలైందని, పది వేల ఏళ్ల క్రితం నాగరికత మొదలైందని, అభివృద్ధి రేటు చాలా వేగంగా సాగుతోందని హాకింగ్ చెప్పారు. అయితే మానవజాతి మరో పది లక్షల సంవత్సరాలు మనగలగాలంటే ఇంతకు ముందు ఎవరూ చేరుకోలేని ప్రదేశాలను మనిషి ప్రయాణించడంపైనే ఆధారపడి ఉందని చెప్పారు.