Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నివాసానికి భూమి పనికిరాదు... మున్ముందు అగ్నిగోళమే : స్టీఫెన్ హాకింగ్

బుధవారం, 8 నవంబరు 2017 (11:45 IST)

Widgets Magazine
Stephen Hawking

మనిషి మనుగడ సాగించేందుకు భూమి పనికిరాదట. ఎందుకంటే భూమి అగ్నిగోళంగా మారిపోనుందట. అందుకే మరో గ్రహం కోసం శోధించాలని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నారు. వచ్చే 600 యేళ్ళలో భూమి అగ్నిగోళంగా మారిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, జనాభా పెరుగుదల. అధిక విద్యుత్ వినియోగం, రేడియోధార్మికవంటి వాటివల్ల భూమి అగ్నిగోళంగా మండిపోతుందని ఆయన అంటున్నారు. 
 
చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రానున్న 600 సంవత్సరాల్లో భూమి అగ్నిగోళంలా మారిపోతుందన్నారు. జనాభా నియంత్రణ లేకపోవడంతో పాటు విచ్చలవిడి విద్యుత్‌ వినియోగం దీనికి కారణమన్నారు. తర్వాతి తరాలు కొన్ని లక్షల ఏళ్లపాటు జీవించాలంటే మనిషి మరో గ్రహానికి వెళ్లడం తప్పదని ఆయన సూచించారు. మరోగ్రహం అంటే సౌరకుటుంబం అవతల భూమిని పోలిఉన్న మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందన్నారు. సౌరకుటుంబానికి చేరువలో ఆల్ఫా సెంటారీ అనే నక్షత్ర సముదాయం ఉందని, అందులో భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అక్కడికి వెళ్లాలంటే కాంతివేగంతో సమానంగా ప్రయాణించగల చిన్నపాటి హెలికాప్టర్‌ను రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం నిధులను అందించాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇన్వెస్టర్లు ముందుకు వస్తే రెండు దశాబ్దాల్లో కాంతివేగంతో సమానంగా ప్రయాణించే వాహనం తయారవుతుందన్నారు. అలా తయారు చేసే వాహనం ద్వారా ఆల్ఫా సెంటారీ నక్షత్రసముదాయంలోకి చేరుకోవచ్చన్నారు. అక్కడ భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశముందని అందులో నివాసం ఏర్పరచుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయన సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోదరుడి అక్రమ సంబంధం: చెల్లెల్ని నగ్నంగా గంట పాటు ఊరేగించారు

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ...

news

థియేటర్‌లో టాయి‌లెట్‌కెళ్లిన మహిళ.. చేయిపట్టిన లాగిన కార్మికుడు...

నిన్నటికినిన్న నెల్లూరులోని సినిమా థియేటర్‌లోని టాయ్‌లెట్‌కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ...

news

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ...

news

తీవ్రవాదుల చేతికి ఎం4 కార్బైన్ ఎలా వచ్చింది.. పాకిస్థాన్‌ను ప్రశ్నించిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్‌పై భారత ఆర్మీ నిప్పులు చెరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి ...

Widgets Magazine