గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (12:39 IST)

టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: ధ్వంసమైన ఆపిల్ స్టీవ్ జాబ్స్ విగ్రహం!

ఆపిల్ కంపెనీ ప్రస్తుతం సీఈఓ టిమ్ కుక్ గే ఒప్పుకున్న నేపథ్యంలో ఆపిల్ కంపెనీ వ్యవస్ధాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్‌లో చోటు చేసుకుంది.
 
ఆపిల్ కంపెనీ మొదటినుంచీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్ధతు తెల్పుతున్న నేపథ్యంలో.. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. 
 
రష్యాలో స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్‌ఈ‌ఎఫ్ఎస్ గ్రూప్ సంస్ధ ప్రచారం నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తాను గేనని అనడంతో స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది.
 
బహిరంగంగా తాను గే నని ప్రకటించిన అమెరికన్ కంపెనీ సిఈవోల్లో టిమ్ కుక్ మూడవ వారు. గే నని ప్రకటించినందుకు టిమ్‌కుక్‌కు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.