గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (12:57 IST)

నీటిలో మునిగిన గ్రామం. బయటికొచ్చింది... ఆ నీటిలో స్నానం చేస్తే రోగాలు మటాష్

నీటిలోపల ఉండే గ్రామాన్ని చూడాలా అయితే అర్జెంటీనా వెళ్లాల్సింది. ఆ గ్రామం నీటిలో ఉండటం ద్వారా కంటికి కనిపించదు. విల్లా ఇపిక్యూయన అనే గ్రామం.. నీటిలో మునిగి వుంది. 1920లో లగో ఇపీక్యూయన అనే సరస్సు తీరంలో

నీటిలోపల ఉండే గ్రామాన్ని చూడాలా అయితే అర్జెంటీనా వెళ్లాల్సింది. ఆ గ్రామం నీటిలో ఉండటం ద్వారా కంటికి కనిపించదు. విల్లా ఇపిక్యూయన అనే గ్రామం.. నీటిలో మునిగి వుంది. 1920లో లగో ఇపీక్యూయన అనే సరస్సు తీరంలో ఈ గ్రామాన్నినిర్మించారు. ఇదొక ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే ఎటువంటి రోగమైనా నయమైపోతుందని నమ్ముతారు. అలాంటి సరస్సుకు తీర ప్రాంతంలో గల ఈ గ్రామాన్ని చూడాలంటే.. నీటిలోనికి వెళ్లాల్సిందే. 
 
ఈ సరస్సు తీరప్రాంతంలో ఉన్న విల్లా ఇపీక్యూయన 1983 వరకు పర్యాటక ప్రదేశంగా అలరారుతుండేది. హోటళ్లు, ఇళ్లు, షాపులు, పార్కులు, మ్యూజియం అన్నీ ఉండేవట. కానీ సరస్సు నీటి మట్టం ప్రతి ఏడాది పెరిగిపోవడంతో ఆ గ్రామాన్ని ఖాళీ చేసి ప్రజలు వలసపోయారు. ప్రస్తుతం సరస్సు నీటి మట్టం బాగా తగ్గడంతో గ్రామం తిరిగి బయటపడింది. పబ్లోనోవక్‌ అనే 81 సంవత్సరాల వయసున్న ఒకతను మాత్రం తిరిగి ఆ గ్రామానికి వచ్చాడు.