శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (12:44 IST)

విన్యాసాలు చేసే రోబో సైనికులు వచ్చేశారోచ్!

రోబో సినిమా చూసి విధ్వంసానికి కాకుండా మంచి పనులకు ఉపయోగపడే రోబోలుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీ మైండ్ వాయిస్ హార్వార్డ్ యూనివర్శిటీ పరిశోధకులకు వినిపించినట్లుంది. 
 
కిలోబోట్స్ అని పిలిచే ఈ రోబోలను హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రాధికా నాగ్‌పాల్ బృందం రూపొందించింది. మొత్తం 1,024 రోబోలను వీరు తయారు చేశారు. వీటిలో ఒక్కో రోబో ఒక పెద్దసైజు నాణెం అంత ఉంటుంది. 
 
మూడు కర్రపుల్లల్లాంటి కాళ్లతో ఉన్న ఈ ఒక్కో రోబో తయారీకి రూ.850 ఖర్చయిందట. పరారుణ సంకేతాలతో ఇవి సమాచారం పంపుకొంటూ ఒకదానితో ఒకటి కలసి పనిచేస్తాయి. ఇంతపెద్ద ఎత్తున రోబోల గుంపును సృష్టించడం, వాటన్నింటినీ ఇలా సమన్వయంతో పనిచేయిం చడం ఇదే తొలిసారట. 
 
వీటిని మరింత అభివృద్ధిపర్చితే రోబోలు పర్వతాలు ఎక్కేందుకు, సముద్రాల్లో ఈదేందుకు, ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.