మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (15:46 IST)

స్వస్తిక్ కనిపిస్తే అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారట!.. గెట్ అవుట్!

హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ గుర్తు కనిపిస్తే చాలు అమెరికాలో ఒంటికాలిపై లేస్తున్నారట. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఏకంగా స్వస్తిక్ గుర్తును బ్యాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఓం అన్నా.. స్వస్తిక్ చిహ్నమన్నా భారతీయులకు పవిత్రమైనవి. పాశ్చాత్యులకు అత్యంత భయంకరమైనది స్వస్తిక్. దానికి కారణమేంటంటే జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పార్టీ నాజీ గుర్తు కూడా స్వస్తిక్ కావడమేనని తెలిసింది. ప్రాశ్చ్యమతాలపై అధ్యయనం చేస్తున్న ఓ యూదు విద్యార్థి భారత్ వచ్చాడు. హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్‌ను తీసుకుని యూనివర్సిటీకి వెళ్లాడు. 
 
అదే యూనివర్సిటీలో చదువుతున్న మరో యూదు విద్యార్థి దీనిని చూసి నాజీల చిహ్నమైన స్వస్తిక్‌గా పొరబడ్డాడు. నాజీల ప్రమాదం ఉందని భావించి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యూనివర్సిటీ అధికారులు అతనిని వివరణ అడిగి, శాంతించారు. అయినప్పటికీ విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా స్వస్తిక్ గుర్తును నిషేందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాడులు జరిగిన దేవాలయాల్లో స్వస్తిక్ గుర్తువేసి గెట్ అవుట్ అని రాశారు.