గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 జులై 2016 (17:35 IST)

స్వీడన్ దేశ ప్రజల్లో ఆ యావ తక్కువే.. రాజకీయ సమస్యగా మారిపోతుందా?

స్వీడన్ దేశ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంతో శ్రుంగార జీవితంపై వారు ఆసక్తి చూపట్లేదని ఆ దేశం నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. తద్వారా స్వీడన్ దేశ ప్రజల్లో శ్రుంగారం తక్కువేనని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. లైంగిక, పునరుత్పత్తి,

స్వీడన్ దేశ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంతో శ్రుంగార జీవితంపై వారు ఆసక్తి చూపట్లేదని ఆ దేశం నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. తద్వారా స్వీడన్ దేశ ప్రజల్లో శ్రుంగారం తక్కువేనని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. లైంగిక, పునరుత్పత్తి, ప్రజల శ్రుంగారం అలవాట్ల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్వీడెన్ సర్కారు సమగ్ర అధ్యయనం నిర్వహించింది.
 
ఈ అధ్యయనంలో ప్రజల్లో లైంగిక సూచికలు తగ్గముఖం పడుతున్నాయని ఆ సర్వే తేల్చింది. లైంగిక సూచికలు ప్రజల్లో తగ్గితే అదో పెనురాజకీయ సమస్యగా మారుతుందని స్వీడెన్ ప్రజా ఆరోగ్య శాఖా మంత్రి గాబ్రియేల్ వెల్లడించారు. దీనిపై సమగ్ర అధ్యయనానికి తర్వాత నివేదిక సిద్ధం చేయాలని ప్రజారోగ్య శాఖ కోరిందని గాబ్రియేల్ తెలిపారు. 
 
స్వీడెన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిర్వహించనున్న ఈ అధ్యయనంలో జూన్ 2019 నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందని గాబ్రియేల్ చెప్పారు. మూడేళ్ల పాటు సాగే ఈ స్టడీలో స్వీడెన్ ప్రజల్లో శ్రుంగార జీవితం ఎందుకు తక్కువగా ఉందని.. పెంపొందింపజేసే మార్గాలంటి వంటి తదితర అంశాలపై మొదటిసారిగా 20 ఏళ్ల వారిపై అధ్యయనాన్ని నిర్వహిస్తారని తెలిసింది.