Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (08:49 IST)

Widgets Magazine
syrian girl

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న సంధించింది.  'మిస్టర్ ట్రంప్! మీరు ఎప్పుడైనా 24 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నారా?' అని ప్రశ్నించింది. శరణార్థులు తిండిలేక, ఆశ్రయం లేక, దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, వారిపై కనికరం చూపకుంటే ఎలా? అంటూ నిలదీసింది. ఆశావహ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని హితవు పలికింది. అంతేనా.. నేను టెర్రరిస్టులా కనిపిస్తున్నానా అంటూ ఆమె బాలిక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
సిరియా లోని దుర్భర జీవితం గురించి ఓ వీడియో ద్వారా వెల్లడించింది. సెలబ్రిటీగా మారిన సిరియా చిన్నారి పేరు బనా అల్బెడ్. వయసు ఏడేళ్లు. ట్విట్టర్ వేదికగా డోనాల్డ్ ట్రంప్‌ను ఏకిపడేసింది. 3 నెలలపాటు బాంబుల మోతతో దద్దరిల్లిన అలెప్పో నగరంలో తాను ఏనాడూ ఆశావహదృక్పథాన్ని కోల్పోలేదని చెప్పింది. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. 'పోనీ మీరు చెప్పండి, నేను టెర్రరిస్టునా?' అని నిలదీసింది. ఇదిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రీ ట్వీట్ అవుతోంది. చిన్నారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పలువురు ట్రంప్‌ను ట్విట్టర్ లో ప్రశ్నిస్తుండటం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ...

news

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు ...

news

ఉగ్రవాదులు కాదు.. అమెరికన్ ఉన్మాదులే రియల్ డేంజర్.. షాక్ కలిగిస్తున్న అసలు లెక్కలు

అంకెల కన్నా మించి వాస్తవాలను చెప్పే కొలమానం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు కదా. ఏడు ముస్లిం ...

news

ఇన్ఫోసిస్ మూర్తిగారే చెబుతున్నారు. ఇక హెచ్1-బి వీసాలు మర్చిపోవలసిందేనా?

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిజంగానే బహుళ సంస్కృతులకు వీలిచ్చే కంపెనీలుగా ...

Widgets Magazine