శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (09:56 IST)

60 గంటల పోరాటంలో బయటపడిన చిన్నారి

తైవాన్ భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిదేళ్ల చిన్నారిని సుమారు 60 గంటల శ్రమించి ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళితే లూనార్‌ నూతన సంవత్సర ఆరంభ దినాన సెలవు కావడంతో అందరిలానే లిన్‌ సు చిన్, ఆమె అత్త చెన్‌ మెజిలు ఇంట్లోనే ఉన్నారు. సరిగ్గా వేకువజామున నాలుగయ్యేసరికి హఠాత్తుగా భూకంపం సంభవించడంతో వారున్న భవనం కూలింది. 
 
ఆ రోజు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షణ సిబ్బంది సోమవారం నాటికి గుర్తించి సజీవంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకూ 38 మంది మృతి చెందారు. 100 మంది గల్లంతయ్యారు. 1994 నాటి భవనంలోనే 34 మంది మరణించడం అత్యంత విషాదకరం తెలిపారు. 
 
భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే పోతుంది. దాదాపు 121 మంది జాడా తెలియడం లేదని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి.ఘటనా స్థలిలో దాదాపు 282 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 340కిపైగా స్వచ్ఛంద కార్యకర్తలు, 105 అగ్నిమాపక వాహనాలు బాధితులను ఆదుకొనేందుకు కృషి చేస్తున్నారు. మృతదేహాల కిందే చిక్కుకుని రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన వారి భయానక స్థితి వర్ణనాతీతంగా ఉందని స్ధానికులు అంటున్నారు.