శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:21 IST)

పాక్‌లో ఉన్న జేఎఫ్-17కు చెక్ పెట్టే తేజాస్ విమానాలు.. మూడేళ్ల తర్వాతే?

పాకిస్థాన్ వద్ద ఉన్న జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలకు చెక్ పెట్టేలా భారత్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తేజాస్ విమానాలు తయారవుతున్నాయి. 1983 తేజాస్ విమానాల తయారీని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ మొదలెట్టగా.. పలు అవాంతరాలు ఎదురయ్యాయి. 8.2 టన్నుల ఈ యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ఇంకా మూడేళ్లు పట్టవచ్చునని తెలుస్తోంది. 
 
కానీ తేజాస్ విమానాలు సిద్ధమైతే పాక్ జేఎఫ్-17 థండర్ విమానాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని భారత రక్షణ శాఖాధికారుల వర్గాలు తెలిపాయి. తేజాస్ విమానాలు ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే) రాడార్, గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం, బీవీఆర్ (బియాండ్ విజువల్ రేంజ్) మిసైల్స్ ప్రయోగం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం జోడించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖాధికారులు తెలిపారు.

ఈ విమానాల్లోని లోపాలన్నింటినీ సరిచేసుకుని.. దూరప్రాంతాలు ప్రయాణించడంతో పాటు ల్యాండింగ్ అయిన గంట వ్యవధిలో మరోసారి టేకాఫ్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పడుతుంది. 
 
2026 నాటికి కనీసం 120 విమానాలను భారత వాయుసేన అమ్ముల పొదిలోకి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో 2018 నాటి 20 జెట్లను తయారు చేసేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. అలాగే 2015-2016లో తొలి తేజాస్ విమానం సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.