మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (17:04 IST)

భారత్‌లో 25 మంది మహిళా ఉగ్రవాదుల సంచారం.. ఎపుడైనా విధ్వంసం!!

భారత్‌లో పలు కీలక నగరాల్లో 25 మంది మహిళా ఉగ్రవాదులు సంచరిస్తున్నారని, వారు ఏ క్షణంలోనైనా విధ్వంసం సృష్టించవచ్చని తాజాగా బంగ్లాదేశ్‌లో పట్టుబడిన తీవ్రవాది ఫాతిమా బేగం (35) వద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ఈమె వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బర్ద్వాన్ బాంబు పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు కావడం గమనార్హం. 
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బేగంతో పాటు.. మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బేగం వద్ద విచారించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం 25 మంది భారత మహిళలకు ఉగ్రవాద శిక్షణ ఇప్పించామని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన మహిళల గురించి ఆరాతీస్తున్నారు. 
 
ఇటీవల ఓ మెడికో 'ఐఎస్ఐఎస్‌'లో చేరేందుకు వెళుతున్న విషయం తెలిసిన పోలీసులు ఆమెకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీలో ఫాతిమాబేగం ముఠాకు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.