శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (14:20 IST)

సెక్స్ రాకెట్‌లో దొరికిపోయిన బ్యూటీ క్వీన్‌ కాంటెస్ట్‌ విజేత.. ఇపుడేం చేస్తోంది?

బ్యూటీ క్వీన్ కాంటెస్ట్ విజేత సెక్స్ రాకెట్‌లో దొరికిపోయింది. ఆమె పేరు తారన్ డక్ థై లియాన్. గత 2014లో తాను చదువుతున్న యూనివర్సిటీలో నిర్వహించిన బ్యూటీ క్వీన్‌ కాంటెస్ట్‌‌లో పాల్గొని తొలి రన్నరప్‌గా ని

బ్యూటీ క్వీన్ కాంటెస్ట్ విజేత సెక్స్ రాకెట్‌లో దొరికిపోయింది. ఆమె పేరు తారన్ డక్ థై లియాన్. గత 2014లో తాను చదువుతున్న యూనివర్సిటీలో నిర్వహించిన బ్యూటీ క్వీన్‌ కాంటెస్ట్‌‌లో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడామె సెక్స్ రాకెట్‌లో రెడ్ హ్యాడెండ్‌గా పట్టుపడటం సంచలనంగా మారింది. 
 
వియత్నాంలోని క్వాంగ్‌ నిన్స్‌ ప్రావిన్స్‌లోని ఓ హోటల్‌‌లో వ్యభిచారం చేస్తూ ఈమె పోలీసులకు చిక్కింది. ఆమెతో పాటుగా ఆమె స్నేహితురాలు డోవాన్‌ ఎన్‌గోక్‌ మిన్హా కూడా పట్టుబడటం గమనార్హం. ఈ కేసులో లియాన్‌కు మూడున్నర ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆమె స్నేహితురాలికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.
 
ఈ బ్యూటీ క్వీన్ సెక్స్ రాకెట్‌లోకి దిగడానికి గల కారణాలని తెలుసుకొనే క్రమంలో పోలీసులకి షాకింగ్ విషయాలు తెలిసినట్టు తెలుస్తోంది. అవేంటీ అన్నది పోలీసులు బయటపెట్టడం లేదు. సెక్స్ రాకెట్‌తో బ్యూటీ క్వీన్ లియాన్ అందమైన కెరీర్‌ని నాశనం చేసుకొందనే ప్రచారం జరుగుతోంది.