శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (11:00 IST)

హిందూ సముద్రంలో చైనా కార్యకలాపాలు భారత్ బ్రేక్: మాలేకు నౌక!

చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలించింది. హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్యకలాపాలకు బ్రేక్ వేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది. 
 
హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలింది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది.
 
జనవరి 21 నుంచి రెండు రోజుల పాటు తొలిసారిగా కొలంబో నౌకాశ్రయంలో మకాం వేసిన విక్రమాదిత్య, సోమవారం నుంచి మూడు రోజుల పాటు మాలేలో ఉంటుందని, దానితో పాటు మిగిలిన చిన్న యుద్ధ నౌకలు తోడుంటాయని తెలిపారు.