శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:54 IST)

ప్రపంచాన్ని ఇంకా వదలని హిట్లర్ భూతం: ఆస్ట్రియాలో అరెస్ట్‌

రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై నాడు ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను పోలిన వ్యక్తిని ఆస్ట్రియాలో గుర్తించారు. తనకు తాను హరాల్డ్‌ హిట్లర్‌ అని చెప్పుకున్న ఆ 25ఏళ్ల ఆస్ట్రియా జాతీ

ప్రపంచానికి హిట్లర్ సృష్టించిన వివక్షా సిధ్ధాంతం పీడ వదిలిందనుకున్నా హిట్లర్ భూతం మాత్రం ప్రజల మస్తిష్కాలను వెంటాడుతూనే ఉన్నట్లుంది. 20వ శతాబ్ది ప్రధమార్థంలో ప్రపంచాన్ని జాతి వివక్షా మారణ హోమంలోకి నెట్టి కోట్లాదిమంది వధకు కారణమైన హిట్లర్ చివరకు కుక్కచావు చచ్చాడు కానీ అతని జ్ఞాపకాలు ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. 
 
ఒకరిని పోలిన మరొకరు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉంటారని చెబుతారు. సరిగ్గా అలాగే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై నాడు ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ను పోలిన వ్యక్తిని ఆస్ట్రియాలో గుర్తించారు. తనకు తాను హరాల్డ్‌ హిట్లర్‌ అని చెప్పుకున్న ఆ 25 ఏళ్ల ఆస్ట్రియా జాతీయుడు, నాజీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. 
 
అచ్చం హిట్లర్‌ మాదిరిగా మీసాలు రూపుదిద్దుకుని, నాడు నాజీలు శాసించిన ప్రాంతంలో తిరుగుతూ, నాటి నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్న హరాల్డ్‌ హిట్లర్‌ను బ్రౌనౌ యామ్‌ ఇన్న్‌ పట్టణంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రియా పోలీసులు తెలిపారు. అదే పట్టణంలో 1889, ఏప్రిల్‌ 20న అడాల్ఫ్‌ హిట్లర్‌ జన్మించడం విశేషం.