శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:49 IST)

విద్యుత్ అలెర్జీతో బాధపడుతున్న మహిళ: ఫ్యానూ, ఫోనూ ఏవీ పడవట!

ఫ్యాన్ లేకుండా అరగంట కూడా ఉండటం కష్టమవుతున్న తరుణంలో.. కరెంట్ అంటే ఓ మహిళకు అలెర్జీ అట. అంతేకాదు.. విద్యుత్ అలర్జీ అనే వ్యాధి ఆమెను సోకిందట. ఫ్యాన్, కంప్యూటర్, మొబైల్ వంటి ఎలాంటి విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలంటే ఆమెకు అస్సలు పడవట. ఇంతవరకు వినని ఈ వ్యాధి యూకేలోని స్వీడన్‌కు చెందిన జాకీ లిండ్సీ (50)కి సోకింది.
 
ఎనిమిదేళ్ల క్రితం ఆమె శరీరంలో వస్తున్న మార్పులను గమనించి వైద్యులను సంప్రదించింది. కళ్ల మంటలు, చేతులు స్పర్శ కోల్పోవడం గమనించింది. మూడేళ్ల తర్వాత మందులు పనిచేయకపోవడంతో ఓ వైద్య ఛారిటీని సంప్రదించింది. జాకీ విద్యుత్ హైపర్ సెన్సిటివిటీతో బాధపడుతోందని ఛారిటీ వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి ప్రపంచంలో కేవలం నాలుగు శాతం మందికే ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 
 
ఇక విద్యుత్ అలర్జీ ఉందని తెలియరావడంతో జాకీ జాగ్రత్త పడడం ప్రారంభించింది. ఇంట్లో విద్యుత్ మొత్తం తీసేయించింది. విద్యుత్ స్థానంలో కేండిల్స్, గ్యాస్ వాడుకుంటూ.. ఫ్యాన్‌ని బంద్ చేసింది. జాకీ సాధారంగా బయటకు వెళ్లదు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఒంటిని కప్పిఉంచే సిల్వర్ సూట్ ధరించి వెళ్తుంది. సాంకేతికంగా ఎంత పెరిగినా ఇలాంటి వింత వ్యాధులు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.