గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జులై 2016 (10:51 IST)

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా థెరిసా మే బాధ్యతల స్వీకారం... విదేశాంగ మంత్రిగా బోరిస్ జాన్సన్

బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె వయసు 59 యేళ్లు. మార్గరెట్‌ థాచర్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మహిళ థెరిసా మే కావడం గమనార్హం.

బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె వయసు 59 యేళ్లు. మార్గరెట్‌ థాచర్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మహిళ థెరిసా మే కావడం గమనార్హం. ఈమె 1997 నుంచి మెయిడెన్‌ హెడ్‌ నుంచి బ్రిటిష్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘకాలం బ్రిటన్‌ హోం మంత్రిగా కూడా ఈమె సేవలు అందించారు.
 
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో పనిచేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె తన భర్త ఫిలిప్‌ మేతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. అంతకన్నా ముందు తన మంత్రివర్గంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. బోరిస్‌ జాన్సన్‌ను కొత్త విదేశాంగ మంత్రిగా, హోం మంత్రిగా ఆంబర్‌ రెడ్‌ను నియమించారు. తన చాన్సలర్‌గా జార్జి ఆస్‌బార్న్‌ను తొలగించారు.