బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:49 IST)

అంతరిక్షానికి క్యాబేజీ రకానికి చెందిన పుష్పించే మొక్క!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారిగా ఓ 3డీ ప్రింటర్, క్యాబేజీ రకానికి చెందిన పుష్పించే మొక్క కూడా చేరనున్నాయి. ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు చేస్తున్న వ్యోమగాములు వివిధ వస్తువులను ప్రింట్ చేసుకునేందుకు త్రీడీ ప్రింటర్‌ను పంపనున్నారు. 
 
ఇంకా రోదసిలో మొక్కల పెరుగుదలపై పరిశోధించేందుకు క్యాబేజీ తరహా మొక్కను స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది.