గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (07:49 IST)

మొండికేసిన డ్రైవర్లు... మొరాయించిన రైళ్ళు

జర్మనీలో రైలు ట్రైనీ డ్రైవర్లు తాము నడిపేది లేదని ఆందోళనకు దిగుతున్నారు. తమ జీతాలను పెంచాలని చాలా కాలంగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తమ జీతభత్యాల పెంపునకు ఇప్పటికే పలుమార్లు చెప్పామని, గత తొమ్మిది నెలల్లో తమ జీత భత్యాలు పెంచాలని ధర్నాకు దిగడం ఇది ఏడోసారని వారు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలనుంచి వారు పూర్తి స్థాయిలో రైళ్లు నడపకుండా ధర్నాకు దిగనున్నారు. 
 
ఇప్పటికే యాజమాన్యాలతో 16 రౌండ్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రైలు డ్రైవర్ల సంఘం తెలిపింది.